Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాజీ భార్యను ఆశ్చర్యానికి గురి చేసిన ఆమిర్ ఖాన్!

  • రీనా పుట్టినరోజు వేడుకకు హాజరైన ఆమిర్ 
  • పార్టీ అరేంజ్ చేసిన మొదటి భార్య పిల్లలు
  • ఆమిర్ వెంట కిరణ్ రావు కూడా
తన మాజీ భార్య రీనా దత్తాను ఊహించని విధంగా ఆశ్చర్యానికి గురి చేశాడు బాలీవుడ్ అగ్రహీరో ఆమిర్ ఖాన్. రీనా 50వ పుట్టినరోజు వేడుకల్లో సడన్ ఎంట్రీ ఇచ్చాడు. వాస్తవానికి తన తాజా చిత్రం 'సీక్రెట్ సూపర్ స్టార్' ప్రమోషన్ కార్యక్రమంలో ఆమిర్ ఉన్నాడు. చిత్ర ప్రమోషన్ కోసం మూడు రోజుల పాటు టర్కీలో పర్యటించిన ఆయన.. సోమవారం ఉదయం 6 గంటలకు ముంబై చేరుకున్నాడు. ఆ తర్వాత వెంటనే మళ్లీ ప్రచారంలో మునిగిపోయాడు.

ఇదే సమయంలో రీనా పిల్లలు జునైద్, ఇరా నుంచి ఆమిర్ కు ఫోన్ వచ్చింది. తమ తల్లి పుట్టినరోజు సందర్భంగా సర్ ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశామని... ఈ పార్టీకి మీరు కూడా రావాలని కోరారు. పిల్లల కోరిక మేరకు సాయంత్రం రీనా బర్త్ డే పార్టీకి వెళ్లాడు. అంతేకాదు, తన రెండో భార్య కిరణ్ రావును కూడా తన వెంట తీసుకెళ్లాడు. రీనాతో కేక్ కట్ చేయించి, షాంపేన్ బాటిల్ తో సందడి చేశాడు. 
aamir khan
kiran rao
reena dutta

More Telugu News